హైదరాబాద్ మిధాని సంస్థపై సైబర్ అటాక్.. 40 లక్షలు టోకరా - నకిలీఐడీ నుంచి మిధాని అధికారులకు సందేశం
16:10 September 20
కెనడా సంస్థ మెయిల్ హ్యాక్.. ఫేక్‌ఐడీ నుంచి మిధాని అధికారులకు మెసేజ్
హైదరాబాద్ కెనడా సంస్థ మెయిల్ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆపై నకిలీఐడీ నుంచి మిధాని అధికారులకు సందేశం పంపారు. మెయిల్‌లో సూచించిన ఖాతాకు మిధాని అధికారులు రూ.40 లక్షలను బదిలీ చేశారు. నగదు రాలేదని కెనడా నుంచి ఫోన్ రావడంతో ఈ మోసం బయటపడింది. కెనడా సంస్థ తప్పిదం వల్లే సైబర్ మోసం జరిగిందని మిధాని అధికారులు వాపోతున్నారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం పోలీసులకు మిధాని అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కెనడా సంస్థ నుంచి మిధాని అధికారులు అల్యూమినియం కొనుగోలు చేశారు.
ఇవీ చూడండి: