తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cab Hits a Girl in Nacharam : 'అక్కడే ఉంటే నా బిడ్డ బతికేది' - నాచారంలో కారు యాక్సిడెంట్‌లో చిన్నారి మృతి

Cab Hits a Girl in Nacharam :హైదరాబాద్ నాచారం అన్నపూర్ణకాలనీలో ఓ చిన్నారిపై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే కాలనీలో ఓ కస్టమర్‌ని ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ కారును వెనక్కి తీస్తున్న సమయంలో అక్కడే ఆడుకుంటున్న మూడున్నరేళ్ల చిన్నారిపై నుంచి వాహనం వెళ్లింది.

Cab Hits a Girl in Nacharam
Cab Hits a Girl in Nacharam

By

Published : May 10, 2022, 9:20 AM IST

Cab Hits a Girl in Nacharam : క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ చిన్నారికి నిండు నూరేళ్లు నిండాయి. అప్పటి వరకు తమతోనే ఆడుకున్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. హైదరాబాద్ నాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, బెక్కల్‌ గ్రామానికి చెందిన యాటాల కరుణాకర్‌-రవళి దంపతులకు కొడుకు రిషి, కుమార్తె సిరి(మూడున్నరేళ్లు) సంతానం. గతేడాది వలస వచ్చి నాచారం అన్నపూర్ణకాలనీలోని వంగా నిలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు.

Car Hits a Girl in Nacharam : సోమవారం సాయంత్రం సిరి ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో మల్కాజిగిరి, విష్ణుపురి కాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రాజీవన్‌ కుమార్‌ కారును అన్నపూర్ణ కాలనీకి వినియోగదారుణ్ని ఎక్కించుకొనేందుకు వచ్చాడు. యువతి ఎక్కగానే వెనక్కి రావడంతో రోడ్డు మీద ఆడుకుంటున్న సిరిపై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. పేదరికం వల్లే నగరానికి వచ్చామని, అక్కడే ఉంటే కుమార్తె బతికేదని తల్లిదండ్రులు బోరున విలపించారు.

ABOUT THE AUTHOR

...view details