సీఏ పరీక్ష తప్పాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రామడుగుకు చెందిన కావ్య(21) తన సోదరి మానస, వరుసకు సోదరుడైన రమాకాంత్‌తో కలిసి ఎస్సార్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో అద్దెకుంటున్నారు. లక్ష్యా ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న కావ్య... ఆదివారం విడుదలైన ఫలితాల్లో తప్పింది.
సీఏ పాస్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సీఏ పరీక్ష తప్పాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ca student suicide at sr nagar
తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కాసేపటి తర్వాత చూసిన సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.