సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సును వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రెండున్నర ఏళ్ల పాపతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
BUSSES ACCIDENT: రెండు బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు - busses accident on patancheru highway news
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
బస్సు ప్రమాదం
హైదరాబాద్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న సంగారెడ్డి డిపో బస్సును.. వెనుక నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Liquor Sales: జోరుగా మద్యం విక్రయాలు.. ఖజానాకు ఆదాయం ఫుల్!