lockers open in axis bank: శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. ఒక రోజు కస్టడీలో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. లాకర్లో ఏమీ లభించకపోవడంతో శిల్పాను తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
లాకర్లు తెరిచిన పోలీసులు
Shilpa bank accounts: శిల్పా బ్యాంకు లాకర్లకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు… ఈ రోజు వాటిని తెరిచారు. శిల్పా బ్యాంకు ఖాతాలో పెద్దగా నగదు లేకపోవడంతో… లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. నార్సింగి పీఎస్‌లో ఆమెపై 3కేసులు నమోదు చేశారు. రూ. 7కోట్లు తీసుకొని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.