Bus Bolta in Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్‌పేట బైపాస్ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడగా... 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్ర మత్తు.. బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు - నల్గొండలో బస్సు ప్రమాదం
Bus Bolta in Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్‌పేట బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే బస్సుకు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
Bus Bolta in Nalgonda
Nalgonda Bus Accident : డ్రైవరు నిద్ర మత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు వెల్లడించారు.
- ఇదీ చదవండి :రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం