తెలంగాణ

telangana

ETV Bharat / crime

Bus Overturned: బస్సు బోల్తా... అందులో 23 మంది ప్రయాణికులు - ap crime news

bus overturned: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరు గ్రామ సమీపంలో.. బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో.. బస్సులో ప్రయాణిస్తున్న 23మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Bus Overturned
Bus Overturned: బస్సు బోల్తా... అందులో 23 మంది ప్రయాణికులు

By

Published : Dec 2, 2021, 10:52 AM IST

bus accident in prakasam district: ఏపీ ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరు గ్రామ సమీపంలో చెరువు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో.. బస్సులో ప్రయాణిస్తున్న 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కందుకూరు నుంచి కనిగిరికి ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు.. పొన్నలూరు చెరువు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెరువు పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలివే...

  • తలపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు

మధ్యప్రదేశ్​లోని బైతూల్​ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి పడిపోయిన ఓ ద్విచక్రవాహదారుడి తలపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బైకర్​ ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపైన నీళ్లు ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మలుపు తిప్పే సమయంలో బైక్​ మీద ఉన్న వ్యక్తి కాస్త వేగంగా బండిని నడిపినట్టు దృశ్యాల్లో కనిపిస్తోంది. బాధితుడు రాఠీపుర్​కు చెందిన ప్రశాంత్​గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బావిలోకి దూసుకెళ్లిన కారు

Car fell into well in Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్​ వద్ద బావిలో పడిన కారు ఘటనలో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కారులో ఉన్న తల్లీకుమారుడి మృతితో వారి కుటుంబంలో.. కారును వెలికి తీసేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొని మరణించిన గజఈతగాడి ఇంట్లో తీరని విషాదం నెలకొంది. శుభాకార్యం నుంచి వస్తుండగా ప్రమాదం జరగటం.. సహాయకచర్యల్లో పాల్గొనేందుకు సద్భావనతో వచ్చిన గజఈతగాడు కూడా మరణిచటం.. ఈ రెండు ఒకే ఘటనలో జరగటం అందరినీ కలచివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ట్యాంక్​బండ్​లోకి దూసుకెళ్లిన కారు

రాష్ట్రంలో ఇవాళ వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు(Road accident report) జరిగాయి. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్​లో అతివేగంగా వెళ్తున్న ఓ కారు హుస్సేన్​సాగర్​లోకి దూసుకెళ్లింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం

Car Caught on Fire on Flyover: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details