ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక చక్రాలు ఊడి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులను వేరే వాహనంలో గమ్యస్థానాలకు చేర్చారు.
Accident: ప్రయాణంలో ఉండగా ఊడిన బస్సు చక్రాలు..
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనక చక్రాలు ఊడిపోయిన ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రమాదం
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్‌నెస్ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు.
ఇదీ చదవండి:HEAVY RAIN EFFECT: రాజధానిలో కుండపోత.. అరగంటలో అతలాకుతలం