తెలంగాణ

telangana

ETV Bharat / crime

దొరికిపోయిన బుల్లెట్ బండి ఫేమ్ అశోక్.. అసలు ఏం జరిగిందంటే? - Ashok caught by ACB while accepting a bribe

Bullet bandi fame TPO Ashok caught by ACB బుల్లెట్ బండి పెళ్లి కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో ఓ వధువు.. కట్టుకున్న భర్త కోసం బుల్లెట్టు బండి ఎక్కి వచ్చేత్తపా అంటూ ... వరుడు కోసం స్టెప్పులేసింది. అయితే ఈసారి ఆ వరుడు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఏం జరిగిందంటే...?

Bullet bandi fame TPO Ashok was caught by ACB while accepting a bribe of Rs.30,000 in rangareddy district
దొరికిపోయిన బుల్లెట్ బండి ఫేమ్ అశోక్.. అసలు ఏం జరిగిందంటే?

By

Published : Sep 20, 2022, 6:45 PM IST

Updated : Sep 20, 2022, 7:07 PM IST

Bullet bandi fame TPO Ashok caught by ACB మీకు బుల్లెట్టు బండి సాంగ్ గుర్తుందా... అదేనండీ ఓ వధువు కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. పెళ్లి బరాత్‌లో వరుడి కోసం డ్యాన్స్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా... మళ్లీ ఓసారి ఈ బుల్లెట్టు బండి విషయం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

దొరికిపోయిన బుల్లెట్ బండి ఫేమ్ అశోక్

మంచిర్యాల జిల్ల జన్నారానికి చెందిన వధువు సాయి శ్రియను అదే జిల్లాలోని రామక్రిష్ణాపూర్​కు చెందిన ఆకుల అశోక్​తో వివాహం జరిపించారు. ఇప్పుడు ఆ అశోక్ చేసిన నిర్వాహకం బయటకు వచ్చింది. అశోక్ ప్రభుత్వ అధికారి. ఇంకేముంది తన చేతివాటం చూపించాలని అనుకున్నారు. రూ.30వేలు లంచం తీసుకుంటూ అ.ని.శా.కు పట్టుబడ్డారు.

రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో అనిశాకు టీపీవో అశోక్ చిక్కాడు. ఇంటినిర్మాణ అనుమతి కోసం రూ.30వేలు డిమాండ్ చేసిన టీపీవో అశోక్.. అనిశా వలలో పడ్డారు. దీనితో బుల్లెట్ బండి ఫేం అశోక్ మరోసారి వెలుగులోకి వచ్చారు.

ఇవీ చూడండి:

Last Updated : Sep 20, 2022, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details