మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో (Electric shock)32 గేదెలు మృతిచెందాయి.
రోటిగూడ గ్రామశివారులో మేతకు వెళ్లిన పశువుల మంద.. తెగిపడిన విద్యుత్ తీగలను తాకడం వల్ల ఒక్కసారిగా నేలకొరిగాయి. సమాచారం అందుకున్న యజమానులు.. మృత్యువాత పడిన పశువులను చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. పాడి పరిశ్రమతోనే ముడిపడిన తమ జీవితాలకు ఇప్పుడు ఆధారం ఏంటంటూ రోధించారు. ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారుల కారణమని ఆరోపించారు. వారే తమకు న్యాయం చేయాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.