ఆన్లైన్ గేమ్ ఆడుతుంటే మందలించారని మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. సీయోనుపురానికి చెందిన అనిల్ కుమార్ నగరంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఆన్ లైన్ గేమ్‌కు బానిసై... వద్దనందుకు ఆత్మహత్య - ap news
మనస్తాపంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. కళాశాలకు వెళ్లకుండా ఆన్ లైన్లో గేమ్ ఆడుతుంటే పెదనాన్న మందలించటంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
suicide, btech student
కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్ గేమ్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో పెదనాన్న జైపాల్ మందలించగా.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2016లో మనస్పర్థలతో అనిల్ తల్లిదండ్రులు విడిపోగా.. అప్పటి నుంచి అతడి పెదనాన్న జైపాల్ వద్ద ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఓ ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ.. మరో ప్రమాదంలో..