BRUTAL MURDERED: నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు కుర్రా లింగరాజు అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు. దామరచర్ల గ్రామానికి చెందిన కుర్రా లింగరాజు అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమాడు ఉన్నారు.
BRUTAL MURDERED: దారుణ ఘటన.. గొంతుకోసి వ్యక్తి హత్య - నల్గొండ జిల్లా తాజా నేర వార్తలు
BRUTAL MURDERED: దామరచర్ల మండలం జాతీయ రహదారి పక్కన అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతడిని గొంతుకోసి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దామరచర్ల
స్థానికంగా ఉన్న గురుకుల పాఠశాలలో వంట మనిషిగా ఒప్పంద పద్దతిలో పని చేస్తున్నాడు. నిన్న రాత్రి భార్య, అత్తతో గొడవపడ్డాడు. తెల్లవారే సరికి లింగరాజు జాతీయ రహదారి పక్కన విగతా జీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Farmer suicide: పంట దిగుబడి రాక.. అప్పు కట్టే దారిలేక.. రైతు ఆత్మహత్య..