హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితుడు తీవ్ర రక్తస్రావంతోనే దాదాపు 100 మీటర్ల వరకు పరుగెత్తి.. కుప్పకూలిపోయాడు.
వ్యక్తి గొంతుకోసిన దుండగులు.. రక్తస్రావంతోనే 100మీటర్లు పరుగెత్తి.. - hyderabad murder latest update
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వ్యక్తి గొంతుకోసి హతమార్చిన గుర్తుతెలియని దుండగులు
రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: కారులో చెలరేగిన మంటలు.. చికిత్స పొందుతూ ఒకరు మృతి