Brutal murder : వీడియో తీస్తూ ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురంలో జరిగింది. మోతె మండలం అన్నారిగూడెనికి చెందిన పడిశాల శంకర్ తన భార్యతో అదే గ్రామానికి చెందిన నరేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో హత్య చేయాలని పథకం రచించాడు.
వీడియో తీస్తూ మెడకు తాడు బిగించి... యువకుడి దారుణ హత్య - suryapet latest
Brutal murder : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి మెడకు తాడు బిగించి.. వీడియో తీస్తూ హత్య చేశారు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో... ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనుమానంతో పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపడింది.
వీడియో తీస్తూ మెడకు తాడు బిగించి యువకుడి దారుణ హత్య
గత నెల 26న శంకర్ అతని స్నేహితుడు మధుసూదన్ కలసి నరేష్‌కు మద్యం తాగించారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన నరేశ్‌ను వీడియో తీస్తూ మెడకు తాడు బిగించి హత్యచేశారు. ఆటోతో శవాన్ని కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :