తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం.. సొంత చెల్లిని గర్భవతిని చేసిన అన్న - bachupalli rape case

దారుణం.. బాలికపై సోదరుడి అత్యాచారం..!
దారుణం.. బాలికపై సోదరుడి అత్యాచారం..!

By

Published : May 19, 2022, 9:43 AM IST

Updated : May 19, 2022, 5:02 PM IST

09:39 May 19

దారుణం.. సొంత చెల్లిని గర్భవతిని చేసిన అన్న

మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచిన కామాంధులు.. సొంతవారినీ వదలడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. ఇలాంటి వారిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా హైదరాబాద్​లోని బాచుపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ మైనర్​ బాలికపై అత్యాచారం జరిగింది. సొంత అన్న ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఒక జంట నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు (17), కూతురు(13) ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి సోదరుడు​.. తన చెల్లికి మాయమాటలు చెప్తూ.. ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. సొంత అన్న కావడంతో బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.

ఈ క్రమంలోనే బాలికకు కొద్ది నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. 4 నెలల గర్భవతి అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. వెంటనే తేరుకుని.. గర్భం తీసేయాలని వైద్యులను కోరింది. దీంతో వైద్యులు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ (మేడ్చల్ డీసీపీయూ) అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులు ఈ నెల 17న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

టీవీ మీదపడి.. రెండేళ్ల చిన్నారి మృతి

అమ్మాయి అందంగా ఉందని బండి ఆపారా.. ఇక అంతే సంగతులు

Last Updated : May 19, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details