వరసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తుండగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బాలిక గర్భం దాల్చింది. దీంతో భయపడి పారిపోయి నగరానికి రాగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దివ్యదశ చైల్డ్‌లైన్ కంట పడ్డారు. బిహార్‌లో పక్కపక్క ఇళ్లలో ఉండే బాలిక(15), బాలుడు(15) కలిసి చదువుకుంటున్నారు. ఆ చనువుతో దగ్గరయ్యారు. వరసకు అన్నా చెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులూ అనుమానించలేదు.
చెల్లిని గర్భవతి చేసిన అన్న.. విషయం తెలుసుకుని ఇరువురు పరార్! - 15 year old girl was raped by a boy
వరసకు అన్నా చెల్లెళ్లు... వయసు 15. అయితే వీరి ఎంత క్లోజ్‌గా ఉన్నా తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. అన్నా చెల్లెళ్లే కదా అనుకున్నారు. తీరా చూస్తే బాలిక 7నెలల గర్భవతి అయింది. ఇంకేముందీ విషయం తెలిస్తే ఊర్లో గొడవ జరుగుతుందని ఇద్దరు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. కానీ చివరకు పోలీసులకు ఎలా చిక్కారంటే..
బాలికకు 2 నెలలుగా రుతుక్రమం ఆగిపోవటంతో బాలుడికి చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఏడు నెలల గర్భం అని చెప్పారు. తెలిస్తే ఊళ్లో గొడవ జరుగుతుందని ఆందోళనకు గురై ఈనెల 22న రైల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దివ్యదిశ చైల్డ్‌లైన్ ప్రతినిధులు గుర్తించి ఆరా తీయటంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తొలుత బాలుడి కుటుంబసభ్యులు రావడంతో అతన్ని అప్పగించారు. ఆ తర్వాత వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు జీఆర్పీలో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. కేసును బిహార్‌కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: