తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder: అన్నదమ్ములిద్దరినీ చెరువులోకి తోసేసి చంపేశాడు! - bodhan murder

వారం రోజుల క్రితం వాళ్ల మధ్య జరిగిన గొడవే.. మరణశాసనవుతుందని ఊహించి ఉండరు. పెద్దనాన్న కొడుకే వాళ్ల పాలిట యముడవుతాడని అనుకోని ఉండరు. మద్యం తాగుదామని తీసుకెళ్లి... మాయమాటలు చెప్పి ఒకరితర్వాత ఒకరిని చెరువులోకి తోసేసి చంపేశాడు ఓ నిందితుడు.

brother killed two of his younger brothers by throwing in pond at rakasipet
brother killed two of his younger brothers by throwing in pond at rakasipet

By

Published : Aug 10, 2021, 4:43 PM IST

నిజమాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేట్ శివారులో దారుణం చోటుచేసుకుంది. శివ, నర్సింలు అనే ఇద్దరు అన్నదమ్ములను వాళ్ల పెద్దనాన్న కుమారుడు వెంకట్​ హతమార్చాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో... మద్యం తాగుదామని చెప్పి బెల్లాల్​ చెరువు దగ్గరికి శివ, నర్సింలును వెంకట్​ తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి మద్యం తాగించాడు. అనంతరం.. తనతో మాట్లాడాలని చెప్పి శివను తీసుకెళ్లి చెరువులో తోసేశాడు. ప్రాణం పోయాక.. నర్సింలును కూడా ఇదే విధంగా చెరువులో తోసేశాడు. అటు నుంచి నేరుగా ఇంటికి వచ్చిన వెంకట్​.. రాత్రి సమయంలో కుటుబ సభ్యులకు సమాచారం అందించాడు.

వారం రోజుల క్రితం వీళ్ల మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవను మనసులో పెట్టుకునే ఈ హత్యను పాల్పడి ఉంటాడని... అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరి మృతదేహాలను చూసిన కుటుంబీకులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెంకట్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details