అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి.. అడ్డొచ్చిన కుమార్తెపైనా.. - నల్గొండ జిల్లా వార్తలు
12:25 January 16
దేవరకొండ మండలం కొండ భీమనపల్లిలో ఘటన
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తమ్ముడు.. అన్నపై గొడ్డలితో దాడిచేసిన ఘటన దేవరకొండ మండలం కొండ భీమనపల్లిలో చోటుచేసుకుంది. కొండ భీమనపల్లికి చెందిన అన్నా-తమ్ముళ్ల భార్యల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ జరుగుతుండగా.. తమ్ముడు మల్లేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
గొడ్డలితో అన్నపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అన్న కుమార్తెపై సైతం దాడికి తెగబడ్డాడు. దాడిలో గాయపడినవారిని కుటుంబసభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించి.. అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:బ్లాక్‌ఫంగస్ సోకి చూపు కోల్పోయిన వ్యక్తి.. మనస్తాపంతో ఆత్మహత్య