Bride Groom Died In Accident : కుమారుడి వివాహ వేడుక కావడంతో ఆ ఇళ్లంతా సందడిగా ఉంది. కొద్ది సేపట్లో పెళ్లి అనగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వివాహ వేదిక వద్దకు బయలు దేరుతున్నారు. ఇంతలో వరుడు.. తన స్నేహితులను తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని నువ్వెందుకురా వెళ్లడం అన్నప్పటికీ.. దూరం నుంచి నా పెళ్లి కోసం వచ్చిన నా స్నేహితులను నేను రిసీవ్ చేసుకోకపోతే ఎలా అంటూ కారు తీసుకుని బయలుదేరాడు. జాగ్రత్తగా వెళ్లు నాన్న.. త్వరగా వచ్చేయి అంటూ బిడ్డను సాగనంపి... కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ లోనికి వచ్చిన వారికి కొంతసేపట్లోనే గుండెలను మెలిపెట్టే వార్త వినాల్సి వచ్చింది. స్నేహితులను తీసుకొచ్చేందుకు వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడన్న వార్తతో కన్నవాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకు నవ్వులు విరిసిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
Bride Groom Died In Accident : పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడిని బలిగొన్న మృత్యువు - చెట్టును ఢీకొన్న కారు వరుడు మృతి
Bride Groom Died In Accident : కాసేపట్లో పెళ్లి.. బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా సందడిగా ఉంది. కుటుంబ సభ్యులంతా కల్యాణ వేదిక వద్దకు బయలుదేరుతున్నారు. ఎవ్వరిలో చూసినా ఆనందం.. ఇంతలో ఓ వార్త వారిని మోములో చిరునవ్వును మాయం చేసింది. కొద్ది సేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఊహించని ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జడ్చర్ల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కలబండ తండా సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా కేంద్రానికి చెందిన చైతన్య ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్ కాలనీకి చెందిన చైతన్యతో ఇవాళ వివాహం జరగాల్సి ఉంది. అయితే తన పెళ్లికి వస్తున్న స్నేహితులను తీసుకొచ్చేందుకు మహబూబ్‌నగర్‌కు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు చైతన్య నారాయణపేట జిల్లాలో తిరుమలాపూర్‌లో ప్రాథమిక ఉన్నత పాఠశాలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. కాసేపట్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడు మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంతో వధువు, వరుడు కుటుంబాల్లోను విషాదం నెలకొంది.
ఇదీ చూడండి :Tragedy in picnic : పెళ్లిరోజే పెను విషాదం... కుమారుడిని రక్షించబోయి..