తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide: పెళ్లైన రెండు వారాలకే యువతి ఆత్మహత్య - bride committed suicide in rangareddy district

పెళ్లై రెండు వారాలు అవుతుంది. ఏం జరిగిందో తెలియదు కానీ... ఆ నవవధువు అత్తింట్లోనే ఉరేసుకుని తనవు చాలించింది. అదనపు కట్నం కోసం భర్త వేధించినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Suicide: పెళ్లైన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య
Suicide: పెళ్లైన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య

By

Published : Jun 10, 2021, 12:52 PM IST

Updated : Jun 10, 2021, 1:08 PM IST

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడులో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలయ్య, స్వరూప దంపతుల కుమార్తె గౌతమికి... మంచాల మండలం చీదేడుకు చెందిన సురేశ్‌తో 14 రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే అత్తింటిలో ఉరేసుకుని గౌతమి బలవన్మరణానికి పాల్పడింది.

అదనపు కట్నం కోసం భర్త వేధించినందునే తమ అమ్మాయి ప్రాణాలు తీసుకుందని... ఆమె బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి :Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

Last Updated : Jun 10, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details