తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికుడు హత్య - గుమ్మడిదల మండలం హత్య

సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ నెల 11న కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి.. ఈ రోజు విగతజీవిగా కనిపించాడు.

Bricks worker murder, annaram murder, sangareddy
Bricks worker murder, annaram murder, sangareddy

By

Published : May 14, 2021, 10:39 PM IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

అన్నారం గ్రామంలో శ్రీధర్​కు చెందిన ఇటుకుల బట్టీలో ఒడిశాకు చెందిన హిమాన్షు పటేల్.. కార్మికుడిగా పని చేసేందుకు వచ్చాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటలకు అతను కనిపించకుండా పోయాడు. అతని భార్య భీమాలి, తోటి కార్మికులు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.

రెండు రోజుల తర్వాత బట్టీలో ఇటుకలు తీస్తుండగా హిమాన్షు పటేల్ మృతదేహం కనిపించింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లుగా యజమాని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం.. అదుపులో నిందితులు

ABOUT THE AUTHOR

...view details