Boyfriend attack on girlfriend: ప్రేమోన్మాదులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన రంజిత్, అదే ప్రాంతానికి చెందిన మరో యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో వారు శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరగడంతో రంజిత్ పదునైన ఆయుధంతో యువతిపై దాడి చేశాడు.
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై పదునైన ఆయుధంతో దాడి.. - hyderabad crime news
Boyfriend attack on girlfriend: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడి కలకలం రేపింది. ఓయూ పరిధిలోని మంజీరా వసతి గృహం సమీపంలో యువకుడి ప్రియురాలిపై పదునైన ఆయధంతో దాడి చేశాడు. తోటి విద్యార్థులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Boyfriend attack
ఘటనలో యువతి చేతికి బలమైన గాయమైంది. దాడి చేసిన అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరార్ కాగా.. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తప్పించుకున్న రంజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 25, 2022, 1:28 PM IST