వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మోరిపిరాల సుభాష్ తండలో... గ్రామ సర్పంచ్ పల్లె ప్రకృతి వనంలో బోరు బావి తవ్విస్తున్నారు. ఆ సమయంలో బాదావత్ ఈశ్వర్ ప్రసాద్(12) అనే బాలుడు అక్కడే ఆడుకుంటున్నాడు. బోర్ వెల్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పైప్లైన్ లీకై బాలుడి తలకు బలంగా తగిలింది. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాలుడి ప్రాణం తీసిన బోర్వెల్ నిర్వాహకుల నిర్లక్ష్యం
బోర్వెల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. తమ కుమారుని మృతికి కారణమైన గ్రామ సర్పంచ్, బోర్వెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలుడి ప్రాణం తీసిన బోర్వెల్ నిర్వాహకుల నిర్లక్ష్యం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈశ్వర్ ప్రసాద్ ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుని మృతికి కారణమైన గ్రామ సర్పంచ్, బోర్వెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Delta Variant: డెల్టా వైరస్ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!