తల్లి మందలించడంతో ఆగ్రహం పట్టలేక గదిలోని పరుపునకు నిప్పంటించి హంగామా చేశాడో కుమారుడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దూబే, కమల దంపతులు కుమారుడు విజయ్ (20)తో కలిసి బాలాపూర్ ఠాణా పరిధి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయ్ ఇంటర్ రెండో సంవత్సరం పూర్తిచేసి ఐటీఐ చదువుతున్నాడు. ఇంటి బాధ్యతల్లో తండ్రితో పాలుపంచుకోవాలని మంగళవారం తల్లి అతన్ని మందలించింది.
'నన్నే తిట్టావు కదమ్మా.. నాతో పాటే నువ్వూ చావు..' - boy tried to kill his mother in balanagar
ఒకప్పుడు తల్లిదండ్రులు కోప్పడినా.. కాస్త మందలించినా.. పిల్లలు బుంగ మూతి పెట్టుకుని అలిగేవాళ్లు. కానీ కాలం మారింది. పిల్లల మనస్తత్వాలూ మారాయి. కొందరు సున్నితంగా ఉంటే.. మరికొందరు క్రూరంగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు మందలిస్తే కొందరు పిల్లలు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మరికొందరేమో వాళ్లపైనే దాడికి తెగబడుతూ హతమారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ బాలాపూర్‌లో చోటుచేసుకుంది.
boy tried to kill his mother
దీంతో కోపోద్రిక్తుడైన విజయ్ గదిలోకెళ్లి మంచంపై ఉన్న పరుపునకు నిప్పంటించాడు. ఈ మంటలు వ్యాపిస్తే నాతో పాటు నీవు చస్తావని తల్లిని హెచ్చరించాడు. తండ్రికి ఈ విషయం తెలిసి ఇంటికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలు ఆర్పాడు. తమ గారాబంతోనే విజయ్ పాడయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలికి చేరుకున్న బాలాపూర్ పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేయడానికి నిరాకరించారు.