Boy Dead at kulsumpura : హైదరాబాద్ కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మూసీ నది తీరాన 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి వివరాల కోసం ఆరా తీయగా.. అతను కుల్సంపుర పరిధిలోని పంచ్ భాయ్ అలవా నివాసి సయ్యద్ సోఫియాన్ అని తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాలుడి అనుమానాస్పద మృతి.. వీధికుక్కల పనేనా..? - కుల్సంపురలో బాలుడు మృతి
Boy Dead at kulsumpura : ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ కుల్సంపుర పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Boy Dead at kulsumpura
నాలుగో తరగతి చదువుతున్న సయ్యద్.. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లాడని అనుకున్నామని.. ఇంతలోనే ఇలా జరుగుతుందనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి శరీరం మీద గాయాలు చూసిన పోలీసులు.. వీధి కుక్కలు కరవడం వల్లే చనిపోయాడమోనని అనుమానిస్తున్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా.. లేక ప్రమాదమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : May 19, 2022, 3:49 PM IST