ముక్కుపచ్చలారని ఓ బాలికపై ఓ బాలుడు అత్యాచారానికి(Minor Girl Rape Case) పాల్పడిన సంఘటన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలో నివసించే ఓ దంపతులు చిన్నపాటి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి చెందిన మేక పిల్ల గురువారం చనిపోయింది. కళేబరాన్ని పారవేయడానికి వీరి కుమార్తె (8) ఊరిబయట ఉన్న కంప చెట్ల వైపు వెళ్లింది. ఆ సమయంలో బాలికను అనుసరించిన ఓ బాలుడు (16) దానిని ఇక్కడ పడేస్తే దుర్వాసన వస్తుందని, ఇంకొంచెం దూరం వెళ్లి పడేయాలని చెప్పి మరింత దూరం తీసుకెళ్లాడు. అక్కడ బాలిక అరవకుండా దుస్తులు ఊడదీసి నోట్లోకి కుక్కాడు. ఆపై అత్యాచారం(Minor Girl Rape Case) చేశాడు.