తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఏపీలోని గుంటూరు జిల్లా మల్లెంపూడి బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడితో అసహజ శృంగారం జరిపి గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

rape and murder of boy
బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Mar 19, 2021, 8:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మల్లెంపూడి గ్రామానికి చెందిన ఓ బాలుడు తప్పిపోయినట్లు బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై తీవ్ర గాయాలుండటంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు.

గొంతు నులిమి హత్య...

ఈ క్రమంలో పోలీసులు విచారణ జరుపుతుండగా మల్లెంపూడికి చెందిన గోపి అనే యువకుడు బాలుడిని హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా.. బాలుడిని అపహరించి, అసహజ శృంగారం జరిపి, గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు.

శిక్ష పడేలా చూస్తాం...

గత నెల 11న వడ్డేశ్వరంలో తప్పిపోయిన బాలుడిని కూడా గోపి హత్య చేసి కాలువలో పడేశాడని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా భావించి, నిందితుడిపై త్వరగా ఛార్జ్ షీట్ నమోదు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీచదవండి:రాష్ట్రంపై కరోనా పంజా.. అప్రమత్తమైన పాలమూరు యంత్రాంగం

ABOUT THE AUTHOR

...view details