ఏపీలోని గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం కొప్పరావూరులో దారుణం జరిగింది. తమ కుమారైను ప్రేమించాడనే కోపంతో.. యువకుడి కాళ్లు, చేతులు నరికారు యువతి తల్లిదండ్రులు.
కొప్పరావూరుకు చెందిన వెంకటేశ్.. అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. విషయం తెలిసిన యువతి తండ్రి.. గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేశాడు. అనంతరం కొంతకాలంగా వెంకటేశ్.. ఆ యువతికి దూరంగా ఉంటూ ఫోన్ చేసేవాడు. గమనించిన యువతి తండ్రి.. గత రాత్రి ఆ యువకుడిని పిలిపించాడు. గ్రామ శివారులో యువకుడి కాళ్లు, చేతులు కిరాతకంగా నరికేశారు.