Boy killed dogs at KBR park: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద మరో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం రోడ్డు పక్కన ఆడుకుంటున్న కుక్క పిల్లలను చంపిన బాలుడు.. ఇప్పుడు పావురాలను అమ్మేందుకు యత్నించాడు. గమనించిన వాకర్లు పోలీసులకు సమాచారం అందిచడంతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
కేబీఆర్ ఉద్యానవనం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వెళ్లేదారిలో జీహెచ్ఎంసీ వాక్ వే వద్ద ఉన్న మూడు కుక్కపిల్లలను నాలుగు రోజుల క్రితం రబ్బరు బెల్టుతో ఓ బాలుడు కొట్టి చంపాడు. ఆ దారిలో వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తి.. అది గమనించి బాలుడిని పట్టుకునే లోగా అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన ఇంటర్సెప్టార్ పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు.