తెలంగాణ

telangana

ETV Bharat / crime

Boy Kidnap: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ - తిరుపతి జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Boy Kidnap in Tirupati : తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ రాయల్‌ను గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా.. ఆదివారం ఉదయం 5.45 గంటలకు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.

Boy Kidnap: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌
Boy Kidnap: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

By

Published : May 2, 2022, 10:27 AM IST

Boy Kidnap in Tirupati : తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్దన్‌ రాయల్‌గా గుర్తించారు. ఓ మహిళ బాలుడిని ఎత్తుకెళ్లింది. శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చొని ఉండగా బాలుడిని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

బాలుడి కిడ్నాప్‌పై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకు వచ్చింది. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తిరుపతి వచ్చి ఏపీ03 జడ్‌ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details