మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. పొలం పనుల్లో భాగంగా ఆకుదారి మల్లేష్(16) ధాన్యం వేరొక చోట పోసి ట్రాక్టర్ నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. పొలంలో మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వెనుక కూర్చున్న కుమ్మరి గణేష్(12), బండారి అజయ్‌ల పైన ట్రాక్టర్ పడటంతో గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఆరేపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. బాలుడు దుర్మరణం - boy died in tractor accident at aarepally village
మంచిర్యాల జిల్లా ఆరేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో బాలుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి
క్షతగాత్రుడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి