తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాలువలో పడి బాలుడు మృతి - తెలంగాణ వార్తలు

ఆడుతూ పాడుతూ అమ్మానాన్నలతో ఓ బాలుడు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. కొంత సమయం తరువాత ఎప్పటిలాగే ఒక్కడే ఇంటికి వెళ్లే సమయంలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతి చెందారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

boy died in  nizam sagar canal in bansuwada kamareddy district
ఘోర విషాదం: కాలువలో పడి బాలుడు మృతి

By

Published : Mar 5, 2021, 12:09 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని జాక్కల్ తండాలో విషాదం చోటుచేసుకుంది. బోడ చందర్,​ పద్మ వ్యవసాయ క్షేత్రానికి కుమారుడు మహేందర్​ని (7) వెంటతీసుకుని వెళ్లారు. ఎప్పటిలాగే ఆడుకుంటూ ఒక్కడే ఇంటికి వెళ్లే సమయంలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతి చెందాడు.

బాలుడి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని బాలుని తల్లిదండ్రులు తెలిపారు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

ABOUT THE AUTHOR

...view details