జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లెలో విషాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనం ఢీకొని దాసరి హరీశ్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదివారం సెలవు దినం కావటం వల్ల హరీశ్ తన తాతయ్యతో కలిసి మేకలు మేపడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మేకల కొట్టం వద్దకు వెళ్లాడు. ఎండలు బాగా కాస్తుండటం వల్ల ఇంటికి వెళ్లాలని తాతయ్య సూచించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో హరీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.