మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోల్ గ్రామంలో విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన చీకటి ఉజిత్… పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా కరెంట్ షాక్ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అమనగల్‌కు చెందిన చీకటి వెంకటేష్-మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. మౌనిక తన ఇద్దరు పిల్లలతో తల్లిగారింటికి ఆదివారం వచ్చింది.
విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలుడు మృతి - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
బాలుడు మృతి, కరెంట్ షాక్తో చిన్నారి మృతి
ఇంటి ముందున్న ఇనుప కోళ్లగూడుకు విద్యుత్ తీగలు ఆనుకొని ఉండగా... బాలుడి కాలు ఆ ఇనుప కోళ్లగూడుకు తాకడంతో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:Viral: కదులుతున్న రైలును ఎక్కబోయి...