ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విషాదం జరిగింది. తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలుడు బావిలో దూకి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ (14) అనే బాలుడి తల్లిదండ్రులు పట్టణంలోని ఆనకట్ట సమీపంలో నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. బాలుడు రోజూ ఉదయగిరికి వచ్చి ఇంటికి నీటిని పట్టి వెళ్లేవాడు. చరవాణి విషయంలో అక్కతో ఘర్షణ పడటంతో తల్లి అతన్ని మందలించింది.
suicide: తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య - నెల్లూరు క్రైమ్ వార్తలు
తల్లి మందలించిందని మనస్థాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది.

ఉదయగిరిలో బాలుడు ఆత్మహత్య
సోదరుడితో కలిసి రషీద్ శుక్రవారం ఉదయగిరికి వచ్చాడు. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. బంధువులు వెతకినప్పటికీ ఆచూకీ లభించలేదు. కృష్ణ మందిరం సమీపంలో నేలబావి వద్ద బాలుడి చెప్పులు ఉన్నాయని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది మోటార్లతో బావిలో నీటిని తోడడంతో అతడి మృతదేహం బయటపడింది.
ఇదీ చదవండి:viral video: కళ్లలో కారం చల్లి తండ్రీకొడుకుల హత్య