boy body was twice buried: ఏపీలోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మంగినపూడి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26వ తేదీన మంగినపూడి గ్రామానికి చెందిన దంపతులకు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో బాలుడు జన్మించాడు. పుట్టిన బాలుడికి ఫిట్స్ రావడంతో తల్లి, బిడ్డను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో బాలుడికి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆ దంపతులు తమ స్వగ్రామంలో బాలుడి ఖననం గత గురువారం నిర్వహించారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది.
చనిపోయాడని ఖననం చేస్తే.. కలలోకొచ్చి తనను తీయాలన్నాడు.. ఆ తర్వాత - ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
boy body was twice buried: మనుషుల మరణాల్లో చాలాసార్లు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం, వింటుంటాం... కొన్ని సార్లు ఆశ్యర్యానికి లోనైతే, మరికొన్నిసార్లు భయాందోళన చెందుతాం. ఇంకొన్ని సార్లు అలా ఎలా జరుగుతుంది అని వాదించి... ఆలోచిస్తుంటాం... ఇప్పుడు ఓ పసికందు మృతి విషయంలోనూ అదే జరిగింది. ఖననం చేసిన బాలుడిని వెలికి తీసి... పాలు తాగించారు. వైద్యులను సంప్రదించగా మరణించాడని చెబితే మళ్లీ ఖననం చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అసలేం జరిగిందంటే..?
చనిపోయిన ముని మనవడు తన కలలో కనిపించి తాను బతికే ఉన్నానని చెప్పినట్లు, తనను బయటకు తీయాలని కోరినట్లు బాలుడి జేజమ్మ చెప్పింది. ఈ విషయాన్ని బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పటంతో... ఖనన స్థలం దగ్గరకు వెళ్లి బాలుడి బయటకు తీశారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో బాలుడు పాలు తాగాడని, మూత్ర విసర్జన చేసుకున్నాడని అన్నారు. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు తిరిగి మార్కాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పినట్లు తెలిపారు. అక్కడ నుంచి స్వగ్రామానికి వచ్చి బాలుడికి మళ్లీ ఖనన సంస్కారాలు నిర్వహించారని పేర్కొన్నారు. మరణించిన బాలునికి రెండు సార్లు ఖననం చేశారని గ్రామస్థులు చెప్పారు.
ఇదీ చదవండి: Lovers suicide: కలిసి చనిపోవాలనుకున్నారు.. కానీ చున్నీ తెగడంతో..!