80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలి(Sexual Harassment on a Minor Girl)పై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన మరవకముందే.. మరో బాలుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారాని(Sexual Harassment on a Minor Girl)కి యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 2న వడ్డేపల్లి మండల పరిధిలో ఏడేళ్ల బాలికను ఆమె ఇంటి పక్కన ఉండే బాలుడు బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి(Sexual Harassment on a Minor Girl) యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కణ్నుంచి పరారయ్యాడు. కూలీ పనికి వెళ్లిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sexual Harassment on a Minor Girl : ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం - jogulamba gadwal district news
ఆడవారిపై మృగాళ్ల అరాచకాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయి. పసిపాప నుంచి పండుముసలి వరకు ఆ కీచకులు ఎవ్వరినీ వదలట్లేదు. అఘాయిత్యానికి గురైన వాళ్లలోనే కాదు.. ఈ దారుణాలకు పాల్పడే వారిలో మైనర్లు ఉండటం బాధాకరమైన విషయం. ఏడేళ్ల బాలిక(Sexual Harassment on a Minor Girl)పై బాలుడు అత్యాచారానికి యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
మరోవైపు ఘటన జరిగి మూడ్రోజులవుతున్నా నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచకుడు ఇంకా బయటే తిరుగుతున్నాడని.. అలాగే వదిలేస్తే ఎంత మంది ఆడబిడ్డలను నాశనం చేస్తాడోనని వాపోయారు. వెంటనే అతణ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ఆడవాళ్లపై అత్యాచారాలు(Sexual Harassment on a Minor Girl) పెరిగిపోయాయి. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. ఆడవారికి రక్షణ కరవవుతోంది. పనిచేసే చోట్ల, బస్సులు, ట్రైన్లలో, చదువుకునే చోట, ఆఖరికి ఇళ్లలోనూ వారికి రక్షణ లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు అమలు చేయకపోవడం.. శిక్షల అమల్లో జాప్యం.. అరాచకానికి పాల్పడటానికి కీచకులకు సహకరిస్తున్నాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాని(Sexual Harassment on a Minor Girl)కి పాల్పడిన వెంటనే కఠిన శిక్షలు అమలు చేస్తే మరోసారి అలాంటి పని చేయడానికి జంకుతారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నా అధికారులు అలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం.