Both sides attacked Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పాత మార్కెట్ ఏరియా సమీపంలో దుకాణాదారులు ఘర్షణకు దిగారు. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసుకున్న దుకాణాల అద్దె విషయంలో ఇరు వర్గాల మధ్య రేగిన వివాదం.. ఒకరిపై ఒకరు దాడిచేసుకునే స్థాయికి చేరింది. పుట్‌పాత్‌పై ఏర్పాటు చేసుకున్న పండ్ల దుకాణం తమదంటే తమదని గొడవ పెట్టుకున్నారు. దీంతో కొద్దిసేపు రహదారిపై అంతరాయం ఏర్పడింది.
రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన చిరువ్యాపారుల గొడవ - భద్రాద్రి కొత్తగూడెం తాజావార్తలు
Both sides attacked Bhadradri Kothagudem: భద్రాచలంలోని పాత మార్కెట్ ఏరియాలో దుకాణాదారులు ఘర్షణకు దిగారు. పుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన దుకాణాల అద్దె విషయంలో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ప్రధాన రహదారిపై అంతరాయం ఏర్పడింది.
Bhadradri Kothagudem
సుమారు అరగంట పాటు ఇరువర్గాలకి చెందిన మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అక్కడ కాసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఇవీ చదవండి: