తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident in Kamareddy: ఒకే రోజు.. రెండు వేర్వేరు ప్రమాదాలు.. భార్యాభర్తలు మరణం - Road Accident in Kamareddy today

Road Accident in Kamareddy: ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడని తెలుసుకున్న ఓ భార్య అతడిని చూసేందుకు బయలుదేరింది. ఇంతలో వీరిని విధి చిన్న చూపు చూసింది. అక్కడికి వెళ్లే క్రమంలో బైక్​ అదుపుతప్పి మృతుడి భార్య కూడా కన్నుమూసింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో దంపతులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో విషాదం నింపింది.

Road Accident in bikkanur
Road Accident in bikkanur

By

Published : Aug 6, 2022, 1:20 PM IST

Road Accident in Kamareddy: ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భార్యభర్తలిద్దరూ మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో చోటుచేసుకంది. అంతంపల్లికి చెందిన సిద్దయ్య తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గ్రామ శివారున జాతీయ రహాదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగం బైక్‌పై ఘటనాస్థలానికి వెళ్తుండగా.. అదుపు తప్పి కిందపడిపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

సిద్దయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అతని భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగంను కూడా అదే ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన సిద్దమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతిచెందడంతో.. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మరణించిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details