ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గొల్ల కంచలి గ్రామంలో నాటు బాంబులు లభించాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో 40 నాటు బాంబులు బయట పడ్డాయి. ఇటీవలే గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆధిపత్యం కోసం ఓ వర్గం వారు వీటిని ఒరిస్సా నుంచి తెప్పించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం.. - latest news in srikakulam
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కంచలి మండలం గొల్లకంచలి గ్రామంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. పోలీసుల తనిఖీల్లో 40 నాటు బాంబులు వరకు లభ్యమయ్యాయి.

ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..
ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..
ఈ ఘటన విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామి రెడ్డి తెలిపారు. అడవి పందులను చంపడానికి.. వీటిని వినియోగిస్తున్నట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని కంచలి పోలీసులు పరిశీలించారు.