కరీంనగర్‌లోని మూడు షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. నగరంలోని వీఆర్‌కే సిల్క్స్ , సౌత్ ఇండియా, మాంగళ్యమాల్స్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో మాల్స్ యజమానులు, సిబ్బంది హైరానా పడ్డారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ ఏసీపీ శ్రీనివాసరావు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో మాల్స్‌కి వెళ్లిన పోలీసులు సుమారు రెండు గంటలపాటు 3 షాపింగ్ మాల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఓ ఆకతాయి ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
కరీంనగర్లో షాపింగ్‌మాల్స్‌కు బాంబు బెదిరింపు.. 2 గంటల పాటు హైరానా - షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు
కరీంనగర్ పోలీసులు ఇవాళ ఉరుకులు, పరుగులు తీశారు. ఎవరో వీఐపీ వచ్చారనో, గొడవలు జరుగుతున్నాయనో కాదు.. షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టారని వచ్చిన ఫోన్ కాల్స్‌తో. నగరంలోని మూడు షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టామని వచ్చిన కాల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో అణువణువూ గాలించారు.
షాపింగ్‌మాల్స్‌కు బాంబు బెదిరింపు