సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలితో పాటు మరో మహిళను వేగంగా ఢీ కొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికురాలు సత్యమ్మ, రోడ్డుపై ఉన్న విట్టమ్మ అక్కడికక్కడే మృతిచెందారు.
viral video: బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బొలేరో వాహనం విధ్వంసం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు మహిళలను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలితో పాటు రోడ్డుపై ఉన్న మరో మహిళ మృతి చెందారు.
![viral video: బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం bolero road accident, two women dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:51:30:1623036090-tg-srd-36-07-bolero-vidwasam-iddari-mruthi-ts10055-07062021082825-0706f-1623034705-814.jpg)
బొలెరో వాహనం ప్రమాదం, ఇద్దరు మహిళలు మృతి
బొలేరో వాహనం బీభత్సం.
స్థానికంగా ఉన్న నాలుగు దుకాణాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనకు కారణమైన బొలెరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:కూలిన నాలుగంతస్తుల భవనం గోడ.. ఒకరు మృతి
Last Updated : Jun 7, 2021, 4:59 PM IST