వనపర్తి జిల్లా కొత్తకోట మండలం 44వ నంబర్ జాతీయ రహదారిపై కడుకుట్ల స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(Accident)లో ఇద్దరు మృతి చెందారు. ఏపీ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం నర్సింగాపల్లికి చెందిన చిరంజీవినాయక్, లక్ష్మీపతి మామిడి కాయలను బొలెరో వాహనంలో హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లి దించి వస్తుండగా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా ఢీ కొట్టారు.
Accident: లారీని ఢీకొట్టిన బోలెరో... ఇద్దరు మృతి
ముందు వెళ్తున్న లారీని బోలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం (Accident) వనపర్తి జిల్లా కడుకుట్ల స్టేజీ వద్ద చోటుచేసుకుంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
accident
ఈ ప్రమాదంలో బోలేరొ క్యాబిన్ లో కూర్చుని ఉన్న చిరంజీవితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌తో పాటు వాహనంలో వెనుక కూర్చుని ఉన్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద (Accident) స్థలాన్ని వనపర్తి జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర రెడ్డి తెలిపారు.