Blast at industry in Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ పంచదార శుద్ధి కర్మాగారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అపోలో, ఇనోదయ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్ సందర్శించారు.
పంచదార కర్మాగారంలో భారీ పేలుడు - crime news
Blast at industry in Kakinada ఏపీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తునే ఉంది. మొన్న విశాఖపట్టణం, ఆ తరవాత తిరుపతి నేడు కాకినాడ ప్రాంతంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ్టి ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8మంది గాయపడ్డారు.
పంచదార కర్మాగారంలో భారీ పేలుడు
ప్యారీ షుగర్స్ పరిశ్రమపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారుల విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.
ఇవీ చదవండి: