తెలంగాణ

telangana

ETV Bharat / crime

Blast in Hyderabad: హైదరాబాద్​లో పేలుడు.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు - తెలంగాణ తాజా వార్తలు

blast at hyderabad Kandi gate two died and one injured
blast at hyderabad

By

Published : Nov 5, 2021, 2:42 AM IST

Updated : Nov 5, 2021, 9:41 AM IST

02:30 November 05

హైదరాబాద్​లో పేలుడు.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

Blast in Hyderabad: హైదరాబాద్​లో పేలుడు.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

దీపావళి పండుగ రోజున హైదరాబాద్​ పాతబస్తీ కందికల్​ గేట్​లో విషాదం చోటుచేసుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలో బాణాసంచా కాల్చటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమబంగాల్​కు చెందిన ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. యూపీకి చెందిన మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

పాతబస్తీ కందికల్​ గేట్​ ప్రాంతంలో ఉల్లాస్​ గత కొంతకాలంగా ప్లాస్టర్ ఆఫ్ ​పారిస్​ (పీఓపీ) బొమ్మలు తయారుచేసే​ యూనిట్​ను నడుపుతున్నారు. దీపావళి పూజ అనంతరం ఆ యూనిట్​లో పనిచేసే పశ్చిమ బెంగాల్​కు చెందిన విష్ణు(25), జగన్​(30), ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బీరెన్(25)కు కొన్ని టపాసులను ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి విష్ణు, జగన్​లు అక్కడికక్కడే మృతిచెందారు. బీరెన్​కు తీవ్రగాయాలయ్యాయి.  

అర్ధరాత్రి వేళ పెద్దశబ్ధం, ఆర్తనాదాలకు ఉలిక్కిపడ్డ స్థానికులు ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్​నుమా ఏసీపీ మాజిద్, ఛత్రినాక ఇన్​స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్ దేవేందర్​లు పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన బీరెన్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో క్లూస్​టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష్ణు, జగన్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పేలుడు గల కారణాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. కేసునమోదుచేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 'మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులు. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించింది. బాణాసంచాకు రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది.'  

                                   - పోలీసులు  

ఇవీచూడండి:Whitener Addicts in Telangana: గంజాయి దొరక్క వైట్​నర్​కు బానిసలై.. మత్తులో మునిగి హత్యలు చేసి...

Last Updated : Nov 5, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details