ఏపీలోని విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్ చేసింది. బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన నలుగురు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల ఒకరు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తిని నాగరాజు అలియాస్ పండుగా గుర్తించారు. హుస్సేన్, రఫీ, కిశోర్‌బాబు అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం...రూ.100 కోసం దాడి - విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ న్యూస్
ఏపీలోని విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం సృష్టించింది. నలుగురి మధ్య తలెత్తిన విభేదాలతో బ్లేడ్‌లతో దాడి చేసుకున్నారు. అందులో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి చేష్టలకు ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు.
గురువారం రాత్రి నలుగురి మధ్య వంద రూపాయల విషయంలో వివాదం తలెత్తగా.. ఇవాళ పరస్పరం దాడులు చేసుకున్నారు. గంజాయి మత్తులో ఉన్న నలుగురూ.. వాంబే కాలనీకి వెళ్లే మార్గంలోని దుర్గాబార్ సమీపంలో బ్లేడ్‌లతో చెలరేగిపోయారు. ఈ దాడితో దుర్గాబార్ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చూడటానికే భీతావహంగా మారింది. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. ఇన్‌ఛార్జ్ ఏసీపీ రమేష్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని దుకాణదారులను ప్రశ్నించి సమాచారం సేకరించారు.
ఇదీ చదవండి: ప్రేమకు అడ్డురాని వైకల్యం- వీల్‌ఛైర్‌పైనే పెళ్లి