తెలంగాణ

telangana

ETV Bharat / crime

10 అడుగుల గొయ్యి తీసి క్షుద్ర పూజలు!

పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని తూర్పు కోట కనకదుర్గ ఆలయంలో పది అడుగల మేర గొయ్యి తీసి క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఈ సంఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

black-magic-at-kanaka-durga-temple-at-thoorpu-kota-in-warangal-urban-district
మరోసారి గుప్తనిధుల కలకలం... 10 అడుగుల గొయ్యి తీసి క్షుద్ర పూజలు!

By

Published : Mar 14, 2021, 7:01 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు కోటలోని కనకదుర్గ ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. ఆలయంలోని అమ్మవారి ముందు భాగాన 10 అడుగుల గొయ్యి తీసి... క్షుద్ర పూజలు నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే తరుచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక ఆలయాల్లో తవ్వకాలు జరిపారని... ఫలితంగా శిథిలావస్థకు చేరాయని స్థానికులు గుర్తు చేశారు. కాకతీయుల నాటి కళా సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ఇదీ చదవండి:గోదావరిలో స్నానానికెళ్లి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details