తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​ఫంగస్​ ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - టాస్క్​ఫోర్స్ పోలీసులు

రెమ్​డెసివిర్​లకు డిమాండ్​ తగ్గటం వల్ల... బ్లాక్​ఫంగస్ ఇంజక్షన్ల మీద పడ్డారు బ్లాక్​మార్కెట్​ అక్రమార్కులు. యాంటీవైరల్ ఇంజక్షన్లకు అధికధరలకు అమ్ముతూ... అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ అక్రమానికి వైద్యులే పాల్పడటం చింతించాల్సిన విషయం.

black fungus injections selling in blackmarket gang arrested in hyderabad
black fungus injections selling in blackmarket gang arrested in hyderabad

By

Published : May 19, 2021, 9:20 PM IST

బ్లాక్​ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు వైద్యులుండటం గమనార్హం. ప్రధాన నిందితుడైన మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మలక్​పేట్ యశోద ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న రవితేజ, మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్​లో విక్రయించేందుకు పథకం పన్నాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న మరో ముగ్గురు సిబ్బందితో చేతులు కలిపాడు. 350 రూపాయలకు ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను కొనుగోలు చేసిన వైద్యుడు రవిజేత... ఒక్కో ఇంజక్షన్​ను రూ. 50 వేలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 84 వద్ద ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా... టాస్క్​పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వైద్యులతో పాటు... మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: మ‌త్తుమందుచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details