తెలంగాణ

telangana

ETV Bharat / crime

నల్ల బజారులో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు.. ముఠా అరెస్ట్ - కరోనా ఇంజెక్షన్ల అక్రమ దందా

బ్లాక్ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ బృందాన్ని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

Black fungus injections black market
Black fungus injections black market

By

Published : Jun 7, 2021, 10:11 PM IST

హైదరాబాద్ నల్లబజారులో.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 ఇంజక్షన్లు, రూ. 29 వేల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు నగరానికి చెందిన పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్లో ఒక్కో టీకాను రూ. 50 వేలకు అమ్ముతున్నట్లు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:suicide: యువతి సూసైడ్​.. లభించని మృతదేహం

ABOUT THE AUTHOR

...view details