తెలంగాణ

telangana

ETV Bharat / crime

అర్థరాత్రి భాజపా నేత అదృశ్యం.. ఉదయం మామిడితోటలో మృతదేహం - కృష్ణా జిల్లాలో భాజపా నేత దారుణ హత్య

BJP leader murder: ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో భాజపా జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లెంకల మల్లారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయిన మల్లారెడ్డి.. ఉదయం మామిడి తోటలో శవమై కనిపించాడు.

BJP leader murder
అర్థరాత్రి భాజపా నేత అదృశ్యంc

By

Published : Feb 19, 2022, 2:37 PM IST

BJP leader murder: ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా భాజపా జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లెంకల మల్లారెడ్డి హత్యకు గురయ్యారు. వత్సవాయి మండలం చిట్యాల- లింగాల గ్రామాల మధ్యనున్న మామిడి తోటల్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కార్యకర్తలతో కలిసి వత్సవాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మల్లారెడ్డి.. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి దాడి చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో భాజపా నేత మృతి: డీఎస్పీ

ఆ తర్వాత మల్లారెడ్డి కనిపించలేదని.. స్థానికుల సమాచారంతో ఈ ఉదయం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించామని డీఎస్పీ చెప్పారు. మల్లారెడ్డి మెడ, భుజాలపై కత్తి గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని వెల్లడించారు. రాజకీయ కారణాలతో మల్లారెడ్డి హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

"చిట్యాల గ్రామానికి చెందిన భాజపా కార్యకర్త లెంకల మల్లారెడ్డి.. అనుమానాస్పద స్థితితో హత్యకు గురయ్యారు. వారి కుటుంబీకుల నుంచి ఫిర్యాదు తీసుకున్న అనంతరం విచారణ చేపడతాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం." -నాగేశ్వర్​ రెడ్డి, నందిగామ డీఎస్పీ

ఇదీ చదవండి:ధర్పల్లిలో ఉద్రిక్తత.. రాళ్లతో భాజపా, తెరాస వర్గాల పరస్పర దాడి

ABOUT THE AUTHOR

...view details